గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం పటాన్ చెరు పట్టణంలోని ఎమ్మెల్యే మాట్లాడుతూ... గణేష్ మండప నిర్వాహకులు తగు సూచనలు సలహాలు పాటిస్తూ వేడుకలను నిర్వహించుకోవాలని సూచించారు. ముఖ్యంగా మండపాల వద్ద నిర్వాహకులు విద్యుత్ కనెక్షన్ ఇచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.