అంతపురం జిల్లా గుత్తి అర్ఎస్ రైల్వే బుకింగ్ కార్యాలయం ఎదుట రైల్వే కార్మికులు, ఉద్యోగుల ఆధ్వర్యంలో వినాయక చవితి నిమజ్జన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. రైల్వే కార్మికులు ప్రతి ఏటా పర్యావరణ రహిత విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. అందులో భాగంగా చిన్నపాటి మట్టి విగ్రహాన్ని కొలువు దీర్చి ఐదు రోజులు పూజలు చేసి గంగమ్మ ఒడికి చేర్చారు. అయితే 1661 టెంకాయలతో రూపొందించిన ప్రధాన వినాయక విగ్రహాన్ని అక్కడే నిమజ్జనం చేసి టెంకాయలు విడి విడిగా చేసి భక్తులకు పంచి పెట్టారు. లడ్డు వేలంపాట నిర్వహించగా రూ.50వేలకు శ్రీనివాసులు అనే ఉద్యోగి దక్కించుకున్నాడు.