మాచవరం మండలం పిల్లేరు వాగుపై ప్రయాణం స్థానికులకు నరకయాతనగా మారింది. నాగేశ్వరపురం, సింగరాయపాలెం, శ్రీ రుక్మిణిపురం గ్రామాల ప్రజలు వాగుపై మోకాలి లోతు వరకు నీరు ప్రవహిస్తుండడంతో ప్రయాణించాలంటే భయంగా ఉందని శుక్రవారం ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకరినొకరు పట్టుకుని గొలుసుకట్టుగా బ్రిడ్జిపై రాకపోకలు సాగిస్తున్నారు. అధికారులు వెంటనే కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.