బోధన్ పట్టణంలో సోమవారం ముస్లిం సోదరులు మిలాద్ ఉన్ నబీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పెద్ద ఎత్తున ముస్లింలు పాల్గొన్నారు. అంబేడ్కర్ చౌరస్తా, రాకాసిపేట్, పాత బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది. మిలాద్ ఉన్ నబీ మహమ్మద్ ప్రవక్త బోధించిన శాంతి, దయ, కరుణ, ఐక్యత వంటి గొప్ప విలువలను గుర్తు చేస్తుందని మత పెద్దలు తెలిపారు