జమ్మికుంట : మండలం కొరపల్లి గ్రామంలోని వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం వద్ద మంగళవారం సాయంత్రం యూరియా కోసం రైతులు పడిగాపులు గాస్తున్నారు చెప్పులు క్యూ లైన్ లో పెట్టీ వేచి చూస్తున్నారు. ఒక పక్క పెట్టుబడి పెట్టీ పంటలు వేస్తే యూరియా బస్తాలు దొరకక పంట పండే పరిస్థితి లేదని రైతులు అంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు మంత్రులు చొరవ తీసుకొని యూరియా అందించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.