ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కలను నియంత్రించాలంటూ, ఆత్మకూరు మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో శ్రీశైలం నియోజకవర్గం SDPI నాయకులు నిరసన తెలియజేశారు.ఈ సందర్భంగా SDPI నాయకులు మాట్లాడుతూ, ఆత్మకూరు పట్టణంలో వీధి కుక్కలు ప్రజలను చిన్నారులను కొరుకుతూ గాయపడుతున్న మున్సిపల్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారని, కావున వెంటనే వాటిని నియంత్రించాలని కోరుతూ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు రసీదుకు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గం SDPI నాయకులు పాల్గొన్నారు.