బనవాసి వద్ద రోడ్డు ప్రమాదం..ఎమ్మిగనూరు మండల పరిధిలోని బనవాసి దగ్గర ఆదివారం రాత్రి బైక్, కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని వెంటనే ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.