మామిడికుదురు మండలంలోని పెదపట్నం, పెదపట్నంలంక గ్రామాల్లోని కూరగాయల తోటలు, పశుగ్రాసం క్రమేపి ముంపు బారిన పడుతున్నాయి. భద్రాచలం వద్ద గంట గంటకు పెరుగుతున్న గోదావరి వరద తీర గ్రామాల ప్రజలను కలవరపాటుకు గురి చేస్తుంది. తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్న వరదతో లంక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మధ్య లంకలో పశుగ్రాసాన్ని వరద నీరు ముంచెత్తిందని స్థానికులు తెలిపారు.