ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని కైకలూరు పట్టణంలోని దాన గూడెంలో జరిగిన ఘర్షణ లో గాయపడిన యువకులను కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో పరామర్శించారు ఈ సందర్భంగా గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ కు ఆదేశించారు దాన గూడెం గ్రామంలో జరిగిన ఘర్షణలో గాయపడిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు ఇలాంటి ఘర్షణ వాతావరణం రాకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు