రోడ్డు భద్రతకు అధికారులు ఎప్పటికప్పుడు పటిష్టమైన చర్యలు చేపట్టి, ప్రమాదాలు నివారణకు గట్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు శుక్రవారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన రోడ్డు భద్రత కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ, పోలీస్, రవాణా, ఆర్ అండ్ బి, వైద్యశాఖ శాఖల అధికారులతో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన భద్రత చర్యలపై కలెక్టర్ సమీక్షించారు.