పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం ప్రత్తిపాడు గ్రామంలో సరస్వతి విద్యాలయంలో జరిగిన ఆరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ చాంపియన్షిప్ పోటీలు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసాయి. గడిచిన నాలుగు రోజులుగా సాగుతున్న ఈ యోగాసన రాష్ట్రస్థాయి పోటీలలో 23 జిల్లాల నుండి సుమారు 550 మంది యోగసాధకులు ఐదు వయస్సు కేటగిరిలలో పది రకాల యోగ పోటీలలో పోటీపడ్డారు. ఈ పోటీలలోని విజేతలందరూ జాతీయస్థాయిలో జరిగే పాల్గొంటారు. సీనియర్ నేషనల్ యోగాసన ఛాంపియన్షిప్ పోటీలు చత్తీస్గడ్ లోను, జూనియర్ నేషనల్ యోగాసన ఛాంపియన్షిప్ పోటీలు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జరగనున్నాయి.