అల్లూరి జిల్లా జిమాడుగుల మండలం సోలభం పంచాయతీ మల్లెపాడు గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో సమీపంలో ఉన్న కొండవాగు దాటేందుకు గర్భిణీలు తీవ్ర ఆవస్తులు ఎదుర్కొన్నారు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో నెలలు నిండిన సాంబే, పుణ్యవతి, సావిత్రి అనే ముగ్గురు గర్భిణీలు ఆసుపత్రిలో వైద్య పరీక్షల కోసం అతి కష్టం మీద సమీప కొండ వాగు దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాగు ఉధృతి ఎక్కువగా ఉండడంతో వాగుపై వెదురు కర్రలు, చెట్టుకొమ్మలతో ఏర్పాటుచేసిన ఓ వంతెన పై ప్రాణాలు పణంగా పెట్టి ఆసుపత్రికి చేరుకున్నారు. తమ గ్రామానికి వెళ్లే రహదారి వద్ద ఉన్న ఈ వాగుపై వంతెన నిర్మించాలని వారు కోరుతున్నారు.