శాసనసభలో కాలేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఘోష్ కమిషన్ రిపోర్టును ప్రవేశ పెట్టబోతున్నామని మంత్రి పోన్నం ప్రభాకర్ కరీంనగర్ లో శుక్రవారం అన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం, తప్పిదం వల్లే ప్రాజెక్టు కూలిపోయిందని రిపోర్ట్ ఇచ్చారని, అప్పటి ప్రభుత్వంలో ఉన్నవాళ్లు తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలన్నారు. శాసనసభలో మీరు చెప్పదలుచుకున్న విషయం చెప్పండని, నివేదికలో మా సొంత అభిప్రాయం ఏమీ లేదని అన్నారు. కాలేశ్వరం కట్టినప్పుడు అప్పటి గవర్నర్ నరసింహన్ కెసిఆర్ కాలేశ్వర రావు అని అన్నారని, మంచి అయితే మీ ఖాతాలో వేసుకొని,ఇప్పుడు మాకు సంబంధం లేదని తప్పించుకోవడం కరెక్ట్ కాదని అన్నారు.