నడిగూడెం మండల బీజేపీ మండల అధ్యక్షుడిగా నియమించాలంటూ మండలంలోని వల్లాపురం గ్రామానికి చెందిన మండల పాపయ్య గౌడ్ సోమవారం గ్రామంలోని శివాలయానికి చేతులు కట్టేసుకొని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మండలాధ్యక్షుల ఎన్నికల్లో సీనియర్లకు జిల్లా బాధ్యులు మొండిచెయ్యి చూపారని, కష్టపడ్డ కార్యకర్తలను పక్కకు నెట్టారని ఆరోపించారు.