మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ 13వ వార్డు లైన్ గడ్డ స్కూల్ దగ్గర ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ పార్టీ జెండా గద్ద మరియు స్తంభం ధ్వంసం చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని బిఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం చెన్నూరు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ దుండగులను అరెస్టు చేయకపోతే రాస్తారోకోలు నిరసనలు జిల్లావ్యాప్తంగా కొనసాగుతాయనీ, ఈ రోజు అధికార అండతో విర్రవీగుతున్న నాయకులకు హెచ్చరిస్తున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆగడాలు మానకుంటే బిఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి సాధిస్తామని వెల్లడించారు.