సుబ్రహ్మణ్య స్వామికి కావడి మోసిన ఎ ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి శనివారం మధ్యాహ్నం 3 గంటలకు సదుంలో వెలసిన సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి గ్రామాలు పాడి పంటలతో సుభీక్షంగా వర్ధిల్లాలని కోరుతూ సుబ్రహ్మణ్య స్వామికి కావడి మోసి మొక్కులు తీర్చుకున్నారు. సదుం మండలం, యర్రాతివారిపల్లెలోని ఎమ్మెల్యే స్వగృహం నుండి ఎమ్మెల్యే భక్తిశ్రద్దలతో కావడి ఎత్తుకుని వెళ్లి సుబ్రహ్మణ్య స్వామికి సమర్పించి పూజలు చేశారు.