ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని సీఐటీయూ అనకాపల్లి జిల్లా కార్యదర్శి ఎం.అప్పలరాజు డిమాండ్ చేశారు. బుధవారం అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం పరిధిలో గల నక్కపల్లిలో వీర వెంకట రాజేశ్వరి ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ఎమ్మార్వో నరసింహమూర్తికి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణతో కలిసి మాట్లాడుతూ.. స్త్రీశక్తి పథకంతో ఆటో కార్మికులకు ఉపాధి దెబ్బతిందని అన్నారు.