వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. అందులో భాగంగా ఈరోజు బుధవారం సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో ఉరుములు మెరుపులతో వర్షం పడుతూ ఒక్కసారిగా తాటి చెట్టు పై పిడుగు పడింది. దీంతో తాటి చెట్టు పైన పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి దీంతో స్థానికులు బాంధవులను గురైన పరిస్థితి నెలకొంది. పిడుగుపాటుకు ఎవరికి ఏమి కాకుండా ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు నల్లబెల్లి ప్రజలు