జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ జేసీఐ వైజాగ్ ఆధ్వర్యంలో మిస్సెస్ ఏవీఎన్ కళాశాలలో మెగా వైద్య శిబిరం బుధవారం జరిగింది. ముందుగా కళాశాల ప్రిన్సిపల్ సింహాద్రి నాయుడు, వైస్ ప్రిన్సిపల్, కృష్ణకుమారి, జ్యోతి ప్రజలను కార్యక్రమం ద్వారా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. వీడెంటల్ హాస్పిటల్ డైరెక్టర్ కే ఎం కే రమేష్ వైద్యులు ప్రశాంతి, గౌతమీ, ఏ పృథ్వీరాజ్, తులసి, ప్రమీల లతీశ, వీడెంటల్, వి డయాగ్నస్టిక్స్, డాక్టర్ అగర్వాల్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొనగ, సుమారు 300 మందికి పైగా సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు