మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మ్యాదరిపేట నుండి దండేపల్లి వరకు సోమవారం ఉదయం బిజెపి పార్టీ శ్రేణులు చేపట్టిన పాదయాత్రలో బిజెపి రాష్ట్ర నాయకులు వెరబెళ్లి రఘునాథ పాల్గొని మాట్లాడుతూ బిజెపి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రైతాంగ సమస్యలపై మ్యాదరిపేట నుండి దండేపల్లి తహసీల్దారు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, తహసీల్దారు కార్యాలయం ఎదుట నిరసన చేపట్టినట్లు తెలిపారు. రెండు లక్షల పైబడిన రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని, అర్హులైన లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలనీ, రైతు కూలీలకు 12 వేల రూపాయలు వెంటనే విడుదల చేయాలని కోరారు.