ప్రజల నుండి అందే అర్జీలు, సేవా దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా పరిష్కారం చేయాలని, బియాండ్ ఎస్ఎల్ఏ ఉంటే సంబందిత అధికారి, సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో విభాగాధిపతులు, అధికారులు, సిబ్బందితో గ్రీవెన్స్, సేవా దరఖాస్తుల పరిష్కారంపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ విభాగాల వారీగా అర్జీల పరిష్కారం సమీక్షించి మాట్లాడారు