కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రి నీతిన్ గడ్కారీని మంగళవారం కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి కలుసుకున్నారు. కామారెడ్డి సెగ్మెంట్లో ఇటీవల వరదల వల్ల దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు చాలా దారుణంగా ఉన్నాయని కేంద్ర మంత్రికి వినతి పత్రం అందించి వివరించారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేయాలనీ మంత్రిని కోరారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కామారెడ్డి ఔటర్ రింగు రోడ కావాలని, వాటి ప్లాన్ మ్యాప్ లు డీపీఆర్ అంచనా వ్యయం చేయించడం జరిగిందనీ, సుమారు 510 కోట్లతో 54 కిలోమీటర్ల పొడవు గల ఔటర్ రింగు రోడ్డు కామారెడ్డి పట్టణం చుట్టూరా అవసరం ఉందని వివరించారు.