కర్ణాటకకు చెందిన ఏడుగురు సభ్యుల ర్యాంపు ముఠాను చీరాల రూరల్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.వారి వద్ద నుండి 14లక్షల రూపాయల నగదు,నేరానికి వాడిన కారును స్వాధీనపరచుకున్నట్లు చీరాల డిఎస్పీ మోయిన్ మీడియాకు చెప్పారు.తమ ప్రాంతానికే చెందిన నాగరాజు అనే స్వర్ణకారుడిని తక్కువ ధరకు బంగారు ఇస్తామని నమ్మించి ఈ ముఠా శనివారం బోయినవారిపాలెం రప్పించి బెదిరించి నగదు అపహరించినట్లు ఆయన చెప్పారు. 24 గంటల్లో ఈ కేసు చేదించినట్లు డిఎస్పి వెల్లడించారు.ఈ ముఠాను పట్టుకున్న పోలీసు బృందానికి ఆయన నగదు రివార్డులు అందజేశారు.రూరల్ సిఐ శేషగిరిరావు, ఎస్సై చంద్రశేఖర్ కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు.