చీమకుర్తి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ను ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ కే విజయ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లోని రికార్డులను పరిశీలించి, పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీట్ చేసిన వాహనాలకు వేలం ప్రక్రియ ద్వారా విక్రయాలు జరిపి వాటిని క్లియర్ చేయాలని ఎక్సైజ్ సీఐ సుకన్యను ఆదేశించారు అదేవిధంగా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎమ్మార్పీ ధరలకే మధ్య విక్రయాలు కొనసాగేలా చూడాలని ఆదేశించారు కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్సై నగేష్ , సిబ్బంది పాల్గొన్నారు