యువతకు భవిష్యత్తుపై కొత్త ఆశలను రేకెత్తిస్తూ, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా "డ్రగ్స్ వద్దు బ్రో" అనే నినాదంతో, నగరంలోని శంకరాపురం గాయత్రి జూనియర్ కళాశాల విద్యార్థులకు శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వాస్తవ పరిస్థితులను వివరించడం ద్వారా విద్యార్థులకు డ్రగ్స్ వలన కలిగే అనర్థాలను కళ్ళకు కట్టినట్లు వివరించారు.రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ కట్టడికి ఏర్పాటు చేసిన 'ఈగల్ టాస్క్ ఫోర్స్ గురించి అధికారులు వివరించారు. ఈగల్ బృందాలు డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలపై ఎలా నిఘా ఉంచుతాయో తెలిపారు. అంతేకాకుండా, NDPS చట్టంలోని కఠిన శిక్షలు గురించి స్పష్టంగా వివరించారు.