పది రోజులపాటు ప్రణాళిక బద్ధంగా అందరూ వ్యవహరించారని సీపీ సీవీ ఆనంద్ అన్నారు. గణేష్ నిమజ్జనాన్ని విజయవంతం చేసేందుకు అహర్నిశలు కష్టపడ్డ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. జీహెచ్ఎంసీ, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, ఆర్టీఏ, హెచ్ఎండీఏ, అధికారుల సమన్వయంతో గణనాథుడి నిమజ్జోత్సవాలు విజయవంతం అయ్యా యన్నారు. ఈ క్రమంలో అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.