జగిత్యాల జిల్లా,మల్యాల మండలం,తాటి పెళ్లి గ్రామ శివారు లో శుక్రవారం7:10 PM కి ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోయిన ఘటన చోటుచేసుకుంది, జగిత్యాల కు చెందిన మధు గౌడ్ అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై తాటి పెళ్లి వెళ్లి తిరిగి జగిత్యాలకు వెళ్తుండగా, గ్రామ శివారు ప్రాంతంలో ఎదురుగా ఒక కారు వేగంగా వస్తుండడంతో,దాని నుండి తప్పించుకునే క్రమంలో రోడ్డు దిగుతుండగా,అదుపుతప్పి పడిపోయిన మధుకి కుడి చేయి విరిగి తలకు తీవ్ర గాయాలు కాగా పరిస్థితి విషమించడంతో,హుటాహుటిన స్థానికుల సహాయంతో చికిత్స నిమిత్తం జగిత్యాల ఆస్పత్రికి తరలించారు,ఇంకా ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది,