రాజన్న సిరిసిల్ల జిల్లా, గోపాలరావు పల్లె వాస్తవ్యుడు పీపుల్స్ వార్ పార్టీ అగ్రనేత కామ్రేడ్ కడారి సత్యనారాయణరెడ్డి కి ఘనంగా నివాళులు అర్పించిన TNGO మాజీ అధ్యక్షుడు బేవరిస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవి ప్రసాద్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 40 సంవత్సరాలకు పైగా విప్లవ పార్టీలో పనిచేసి ఆదివాసి,బడుగు,బలహీన వర్గాల పేద ప్రజల తరఫున హక్కుల కొరకు పోరాటం చేసిన కామ్రేడ్ సత్యనారాయణరెడ్డి ఎన్కౌంటర్లో చనిపోవడం చాలా బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నక్సల్స్ తో శాంతి చర్చలు జరపాలని కోరారు.