పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కడప జిల్లా పర్యటనకు వచ్చిన విద్య,ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. ఉదయం కమలాపురం నియోజకవర్గం బుగ్గలేటిపల్లిలోని తన క్యాంప్ సైట్ లో 69వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ ను కలిసేందుకు పెద్దఎత్తున ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వినతులు స్వీకరించారు. అనంతరం వారితో కలిసి ఫోటోలు దిగారు.పోడు భూములకు డీకే పట్టాలు మంజూరు చేయండని ఇప్పపెంట గ్రామానికి చెందిన 45 గిరిజన కుటుంబాలు కోరారు.