కామారెడ్డి పట్టణంలోని జన్మభూమి రోడ్డులోని, సాయిబాబా టెంపుల్ దగ్గర సోమవారం రాత్రి ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న 5 గురిని పక్క సమాచారం మేరకు పట్టుకొని అరెస్ట్ చేసినట్లు పట్టణ సీఐ. నరహరి తెలిపారు. పేకాట ఆడేవారి దగ్గర నుండి రూ. 1950రూపాయలు, పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిని మంగళవారం కోర్టు ముందు హాజరు పరచనున్నట్లు తెలిపారు. పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవని సీఐ నరహరి హెచ్చరించారు. పేకాట ఆడిన, మద్యం సేవించిన ఇతర కార్యకలాపాలకు పాల్పడితే చట్టారీత్యా చర్యలు తప్పవని తెలిపారు.