గాదిగూడ మండలంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా విస్తృతంగా పర్యటించారు. అర్జుని గ్రామ పంచాయితీ పరిధిలోని మారుగుడ పెద్ద వాగు, దర్మగూడ వాగులను పరిశీలించిన కలెక్టర్..వాగులపై వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు తెలిపారు.జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు వాగుల సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువుల కాపర్లు అటువైపు వెళ్ళవద్దని సూచించారు. అటువైపు వెళుతున్న వైద్య సిబ్బందిని చూసి వారితో మాట్లాడిన కలెక్టర్.. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశమున్న నేపథ్యంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.