రాజధాని అమరావతిలో యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు జపాన్ కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ టోక్యో బృందం మంగళవారం పర్యటించింది. సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ తో కలిసి శాఖమూరు సమీపంలోని భూములను జపాన్ బృందం పరిశీలించింది. ఈ పర్యటనలో భాగంగా రాజధానిలో ఇప్పటికే నిర్మించి ఉన్న ఎస్ఆర్ఎం, విట్ యూనివర్సిటీలను కూడా ఈ బృందం సందర్శించనుంది.