దోమ చిన్నదే కానీ కుడితే చాలా ముప్పే అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం హెచ్చరించారు. సోమవారం ఎంవిపి కాలనీ లోనిఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు దోమలు కుట్టడం వల్ల వచ్చే వ్యాధుల గురించి గ్రీన్ క్లైమేట్ టీం అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాఫిలస్, క్యూలెక్స్, ఎడిస్ ఆడ దోమల వల్ల మలేరియా, డెంగ్యూ, మెదడువాపు, బోద వ్యాధులు ప్రబలుతాయి అన్నారు. వీటి నివారణకు దోమలు పుట్టకుండా కృషి చెయ్యాలి అన్నారు. జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించండి అని కోరారు.