హనుమంతునిపాడు: గణేష్ మండపాల వద్ద నిర్వాహకులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని హనుమంతునిపాడు ఎస్ఐ మాధవరావు సూచించారు. హనుమంతునిపాడు మండలంలోని పలు గ్రామాల్లో ఎస్సై మాధవరావు బుధవారం పర్యటించి, గణేష్ మండపాల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. గణేష్ మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. మద్యం తాగి గణేష్ మండపాల వద్ద ఎవరు ఉండవద్దన్నారు. గణేష్ మండపాల వద్ద అల్లర్లకు పాల్పడినా, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్న కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.