డీఎస్సీ 2025 సెలెక్షన్ లిస్టు విడుదల చేయాలి అని పిడిఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు ఆయన మీడియాతో మాట్లాడారు. డీఎస్సీ అప్లికేషన్ చివరి తేదీ నాటికి అర్హతలు సాధించి తదుపరి సర్టిఫికెట్లు వచ్చిన వారిని ఉద్యోగ అర్హత సాధిస్తే వారికి కూడా సెలక్షన్ లిస్ట్లోకి చేర్చాలని కోరారు. ప్రధానంగా డీఎస్సీ 2025 అభ్యర్థుల గందరగోళాన్ని నివారించడానికి సెలక్షన్ లిస్ట్ విడుదల చేస్తూ కేటగిరి వారి కట్ ఆఫ్ మార్కులను విడుదల చేయాలని అన్నారు.