వాల్మీకిపురం మండలం కొత్త మంచూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం వి.ప్రకాష్ జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయునిగా ఎన్నికై శుక్రవారం రాష్ట్ర రోడ్డు రవాణా మరియు క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి చేతుల మీదుగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం రోజున జిల్లా ఉత్తమ అవార్డును స్వీకరించారు.అవార్డు గ్రహీత వి.ప్రకాష్ ను కలికిరి అభివృద్ధి కమిటీ చైర్మన్ రెడ్డివారి యోగేష్ రెడ్డి శనివారం పాఠశాలలో శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. అదేవిధంగా ఆ పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు.