Kavali, Sri Potti Sriramulu Nellore | Aug 27, 2025
జలదంకి మండలం శ్రీ గంగా పార్వతీ సమేత జానకి రామలింగేశ్వర స్వామి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో బుధవారం వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వినాయకుడికి స్థానికులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జిల్లా స్థాయి ఎడ్ల బండలాగు పోటీలు ప్రారంభించారు. ఈ పోటీలో వివిధ ప్రాంతాల నుంచి 13 జతల ఎద్దులు పాల్గొన్నాయి. పోటీలు పూర్తయ్యాక విజేతులను ప్రకటిస్తామని నిర్వహకులు తెలిపారు. ఈ కార్యక్రమం బుధవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జరిగింది.