ముస్లింలపై కూటమి ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతుందని కర్నూలు లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు మండిపడుతున్నారు. సోమవారం ఉదయం 12 గంటలు కర్నూలు కలెక్టరేట్ ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఇమామ్, మౌజ్జాన్ లకు ప్రభుత్వం ఇవ్వవలసిన గౌరవ వేతనాలు పెండింగ్ పెట్టారని, టి.డి.పి ప్రభుత్వం ఇమామ్లకు నెలకు 10,000/- మరియు మౌజ్ఞాన్లకు నెలకు రూ. 5,000/- గౌరవ వేతనం నిరంతరం చెల్లిస్తామని చెప్పి అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.