నల్లగొండ మండలం ఖాజీరామారం గ్రామంలోని ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొత్త కుంట కట్ట తెగిపోవడంతో రైతుల పొలాలకు ఇసుకమేట చేరి తీవ్ర నష్టం జరుగుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున ప్రభుత్వాన్ని శుక్రవారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక సమస్యలపై సర్వే నిర్వహించి గ్రామంలో తెగిన గుంటకట్టను పరిశీలించారు. ఇరిగేషన్ అధికారులు వెంటనే స్పందించి కట్టను పూడ్చాలని రైతుల పంటలు భూములు రక్షణ పొందెల చర్యలు తీసుకోవాలన్నారు.