అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి తాండ సమీపంలోని వ్యవసాయ తోటలో మోటార్లకు అమర్చిన కేబుల్ వైర్లను గుర్తుతెలియని దొంగలు బుధవారం రాత్రి చోరీ చేశారని గురువారం రైతులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన సుమారు 12 మంది రైతులకు చెందిన బోరుబావుల కేబుల్ వైర్ లను అపహరించిన దొంగలు పెట్రోల్ గోపాల్ రఘు లకు చెందిన మోటర్ స్టార్టర్ పెట్టెలను ఎత్తుకొని వెళ్లారు. సంఘటనపై ఎస్ఐ శివ ఆదేశాలు మేరకు ట్రైనీ ఎస్సై మహేష్ పోలీసులతో కలిసి పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.