గంగవరం: మండలం బూడిది పల్లి గ్రామంలో ఎస్ డి పి ఐ పార్టీ నాయకులు కార్యకర్తలు తెలిపిన సమాచారం మేరకు. బూడిద పల్లి గ్రామంలో మనమ్మ అనే ఒక దళిత మహిళ తన సొంత జాగాలో నిర్మించుకున్న షెడ్డును, పోలీసు మరియు రెవెన్యూ అధికారులు కక్షగట్టి కూల్చేయడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసారు. పేదల పక్షంలో ఉండి వారికి న్యాయం చేయాల్సిన అధికారులే ఈ విధంగా చేస్తే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ కలుగజేసుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేశారు.