చట్టం ప్రకారం వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, దత్తత తల్లిదండ్రులు, వయోవృద్ధులు తమ పిల్లలు లేదా చట్టబద్ధమైన సంరక్షకుల నుండి పోషణ కోరే హక్కు కలిగి ఉంటారని, వృద్ధాప్యంలో వారిని ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా పిల్లలు/సంబంధితులు తమ తల్లిదండ్రులు వృద్ధులను పోషించే పూర్తి బాధ్యత వారి పిల్లలదే అన్నారు.వృద్ధాప్య తల్లిదండ్రుల పోషణకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని, ఆన్లైన్ ద్వారా దాఖలయ్యే మెయింటెనెన్స్ ఫిర్యాదులను ట్రిబ్యునల్ ద్వారా 90 నుండి 120 రోజుల్లో పరిష్కరించబడతాయని కలెక్టర్ బిఎం సంతోష్ తెలిపారు.