గిరిజన ప్రజలు నిరాశ చెందకుండా తెలంగాణ మరియు కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలయ్యే సంక్షేమ పథకాలు నేరుగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడానికి మండల్ లెవెల్ కమిటీ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు.గురువారం సాయంత్రం ఐటీడీఏ సమావేశం మందిరంలో మండల్ లెవెల్ బ్లాక్ లెవెల్ మాస్టర్ శిక్షకులతో ఆది కర్మయోగి అభియాన్ పథకం విజయవంతంగా నిర్వహించడానికి అందించిన మూడు రోజుల శిక్షణ శిబిరం ముగింపు సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీవో రాహుల్ పాల్గొన్నారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడారు