రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల దృశ్య ముసాయిదా ఓటరు జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే లిఖితపూర్వకంగా తెలియజేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. శుక్రవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో జిల్లా అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ తో కలిసి కలెక్టర్ ఓటరు జాబితా తయారీ, ప్రచురణ, పోలింగ్ స్టేషన్ల వద్ద జాబితా ప్రచురణ తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు.