సిద్దిపేట 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంకిరెడ్డిపల్లి గ్రామ శివారులో రైల్వే ట్రాక్ వద్ద గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 4 నిందితులను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించినట్లు సిద్దిపేట 3 టౌన్ సిఐ విద్యాసాగర్ శనివారం తెలిపారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామానికి చెందిన నలుగురు నిందితులుగా పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద నుండి మొత్తం 254.9 గ్రాముల గంజాయి, 4 సెల్ ఫోన్లు, నగదు రూ. రూ 400 లు, 2 మోటార్ సైకిళ్ళు, గంజాయి త్రాగడానికి ఉపయోగించే రోల్ పేపర్,ఒక లైటర్ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. నలుగురు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్