అనంతపురం జిల్లా కూడేరు మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మండలానికి రెగ్యులర్ తహసిల్దార్ ను నియమించాలని రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించి జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. గత 16 నెలలుగా కూడేరు మండలానికి రెగ్యులర్ తహసిల్దార్ లేకపోవడం వలన ప్రజలు ఇబ్బందులు పడుతూ సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇంచార్జ్ తహసిల్దార్ల కు తహసీల్దార్ కార్యాలయం విడిది గృహంగా మారిందన్నారు. కావున రెగ్యులర్ తహసీల్దార్ నియమించాలని వారు పేర్కొన్నారు.