వరంగల్ జిల్లా నెక్కొండ, కానాపూర్ మండలం అయినపల్లి లోగల మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలను శనివారం రాత్రి 7గంటలకు చేరుకొని తనిఖీ చేశారు వరంగల్ కలెక్టర్ సత్య శారదా దేవి. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మమేకమై కాసేపు వారితో ఆటవిడుపు చేశారు కలెక్టర్. అనంతరం పిల్లలకు అందిస్తున్న ఆహారం హాజరు సంబంధిత రిజిస్టర్ లను పరిశీలించి దినచర్యపై ఆరా తీశారు. హాస్టల్ ప్రాంగణాన్ని వంటశాలను స్టోర్ రూమ్ కూరగాయలు భద్రపరిచే గదిని హాస్టల్ పరిసరాలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు ఒక కలెక్టర్ సత్యసారదా దేవి.