మహిళా భద్రతకు, మహిళల గౌరవానికి పోలీస్ శాఖ కృషి చేస్తోందని ఎస్పీ నరసింహ అన్నారు. సోమవారం సూర్యాపేటలోని ఎస్పీ కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ ఆధ్వర్యంలో అత్యాచార వేధింపులు నిరోధక చట్టం-2013పై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మహిళా ఉద్యోగులకు, గృహిణులకు, బాలికలకు చట్టపరమైన రక్షణ, న్యాయ సహాయం అందించడంలో పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు.