హనుమకొండ జిల్లా: హనుమకొండ ప్రాంతంలో అత్యధిక వర్షాలు కురిసినప్పటికీ ఏ ఒక్క ప్రాంతం కూడా మునగకుండా అభివృద్ధి చేశామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. నేడు పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నాయిని శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి ఇవ్వని నిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పశ్చిమ నియోజకవర్గానికి ఇచ్చారని ఆ నిధులతో పాటు ఎంపీ నిధులను కూడా కలిపి వరంగల్ అభివృద్ధికి తోడ్పడుతున్నామని ఈ సందర్భంగా మాట్లాడారు.