మాసబ్యాంక్ మత్స్యభవన్ వద్ద చేప కాంట్రాక్టు రైతులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. 2 సంవత్సరాలుగా రావాల్సిన బిల్లులు చెల్లించకపోవడంపై కాంట్రాక్టర్స్ ఆందోళన చేపట్టారు. 2023-24కి రూ.75 కోట్లు, 2024–25కి రూ.34 కోట్లు బకాయిలున్నాయన్నారు. రైతుల ప్రభుత్వమని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కకు చేప రైతులు, కాంట్రాక్టర్లు కనపడటం లేదా? అని ప్రశ్నించారు.